: దుర్గమ్మ ఆశీస్సుల కోసం ‘వంగవీటి’లో కొన్ని షాట్లు విడుదల చేస్తా: రాంగోపాల్ వర్మ
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘వంగవీటి’ చిత్రానికి సంబంధించిన కొన్ని ధ్రువ తారల్లాంటి షాట్లు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ‘దుర్గమ్మ ఆశీస్సుల కోసం అక్టోబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు కాపు కాసే కమ్మనైన ‘వంగవీటి’కి సంబంధించిన కొన్ని ‘ధ్రువ’ తారల్లాంటి చాలా మామూలు షాట్లు రిలీజ్ చేయబోతున్నాను’ అని ఆ ట్వీట్ లో వర్మ పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే విడుదలయ్యాయి.