: ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సింది కేసీఆరే: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్


తెలంగాణలో జిల్లాల విభజన చేపట్టక ముందు ఒక మాట, విభజన జరిగిన తర్వాత మరో మాట మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్లు, ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ సీఎం కేసీఆర్ నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సింది తాను కాదని కేసీఆరే నని మండిపడ్డారు. రాజకీయ సంస్కారం లేని కేసీఆర్ ఈ విధంగా మాట్లాడటం తగదని అన్నారు. దేశంలో కేసీఆర్ లాంటి సీఎం మరెక్కడా ఉండరని, ఎందుకంటే, ప్రజలను కలిసిన పాపాన ఆయన పోలేదని అన్నారు. కేసీఆర్ పాలనను ‘తుగ్లక్ పాలన’గా ప్రజలు భావిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, కాకపోతే అశాస్త్రీయ విభజనను తాము ఒప్పుకోమని అన్నారు.

  • Loading...

More Telugu News