: తమిళనాడు గవర్నర్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగానే క‌లిశాను.. వ‌దంతులు సృష్టించ‌కూడ‌దు: చెన్నైలో వెంక‌య్య‌


గ‌తనెల 22 నుంచి చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న‌ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత త్వ‌ర‌లోనే కోలుకుంటార‌ని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ రోజు ఆయ‌న చెన్నైలో ఆ రాష్ట్ర తాత్కాలిక గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగర్‌రావుతో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా వెంక‌య్య మీడియాతో మాట్లాడుతూ... గవర్నర్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని స్ప‌ష్టం చేశారు. ఇటువంటి స‌మ‌యంలో రాజ‌కీయాలు చేయ‌కూడ‌ద‌ని ఆయ‌న అన్నారు. ఈ విషయంలో వదంతులు సృష్టించకూడ‌ద‌ని కోరారు. జయలలిత పోరాటయోధురాలని వెంక‌య్య అన్నారు. ఆమెకు అంతర్జాతీయ వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News