: జయలలితకు పరామర్శల వెల్లువ.. ఆసుపత్రికి చేరుకున్న కేరళ గవర్నర్, సీఎం, పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్


గ‌తనెల 22 నుంచి చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత చికిత్స తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి గురించి తెలుసుకునేందుకు ఈరోజు అపోలో ఆసుప‌త్రికి కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ స‌దాశివం, ముఖ్య‌మంత్రి పినరయి విజయన్ వ‌చ్చారు. మ‌రోవైపు పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ కూడా ఆసుప‌త్రికి చేరుకున్నారు. జయ‌ల‌లిత‌ ఆరోగ్య ప‌రిస్థితిపై వారు వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. జ‌య‌ల‌లిత ఆరోగ్యం మెరుగుప‌డుతోంద‌ని డాక్ట‌ర్లు త‌న‌కు తెలిపినట్లు ఈ సంద‌ర్భంగా కిర‌ణ్‌బేడీ మీడియాకు తెలిపారు. జ‌య‌ల‌లిత త్వ‌ర‌గా కోలుకోవాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. కాగా, ‘అమ్మ’ కోలుకోవాలంటూ జయలలిత అభిమానులు ఆసుపత్రి వద్దే యాగం నిర్వ‌హిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News