: ఫాలో ఆన్ ఊబిలోకి జారుతున్న న్యూజిలాండ్!
ఇండోర్ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టులో పరుగులు సాధించడంలో విఫలమైన న్యూజిలాండ్ జట్టు ఫాలో ఆన్ ఊబిలోకి జారుతోంది. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 557 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన నేపథ్యంలో, ఫాలో ఆన్ ప్రమాదం నుంచి బయట పడాలంటే న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులను దాటాల్సి వుంది. కానీ ఇప్పటికే 51 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్లను కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. అంటే మరో 201 పరుగులు చేస్తేనే తిరిగి భారత్ ను రెండో ఇన్నింగ్స్ కు దింపగలుగుతుంది. ప్రధాన ఆటగాళ్లందరూ స్వల్ప స్కోర్లకే పెవీలియన్ కు చేరిన వేళ, మరో 200 పరుగులు చేయడం ఆ జట్టు ముందున్న పెను పర్వతం కిందే లెక్క. ప్రస్తుతం నీషామ్ 4, వాట్లింగ్ 4 పరుగులతో ఆడుతున్నారు. వీరిలో ఎవరు అవుట్ అయినా వచ్చేది బౌలర్లు మాత్రమే. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు నాలుగు వికెట్లు దక్కగా, ఓపెనర్ గుప్టిల్ ను సైతం అశ్విన్ రన్నౌట్ చేయడం విశేషం.