: ఆశ్రయం ఇస్తే బాంబు దాడి చేయాలనుకున్నాడు!
ప్రాణాలకు తెగించి, సరిహద్దులు దాటుకుని వస్తే... అయ్యో పాపం అని అక్కున చేర్చుకున్నారు. ఆశ్రయం కల్పించారు. కానీ, వారికే ద్రోహం చేసేందుకు సిద్ధపడ్డాడు ఈ నీచుడు. వివరాల్లోకి వెళ్తే, బాంబు దాడులకు ప్లాన్ వేశాడన్న ఆరోపణలతో 22 ఏళ్ల జబేర్ అల్ బకర్ ను జర్మనీలోని శాక్సోనీ స్టేట్ పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వారు వెల్లడించారు. టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేశామని చెప్పారు. జబేర్ అల్ బకర్ సిరియా నుంచి తరలివచ్చిన ఎంతో మంది శరణార్థుల్లో ఒకడు. శనివారంనాడు చెమ్నిట్జ్ పట్టణంలోని ఓ అపార్ట్ మెంట్ పై పోలీసులు దాడి చేసినప్పుడు... జబేర్ తృటిలో తప్పించుకున్నాడు. కానీ, నిన్న రాత్రి పట్టుబట్టాడు. జబేర్ ఉదంతంతో ఓ కొత్త సందేహం తలెత్తుతోంది. శరణార్థుల ముసుగులో ఐఎస్ ఉగ్రవాదులు వివిధ దేశాల్లో ఎంటర్ అయ్యారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.