: ఇండోర్ టెస్టు: కీలక వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ భారత్ పర్యటనలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో న్యూజిలాండ్ జట్టు కీలక వికెట్టును కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్ లాథమ్ 104 బంతుల్లో 53 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో 58 పరుగులతో గుప్తిల్, 2 పరుగులతో విలియమ్‌సన్ ఉన్నారు. న్యూజిలాండ్ స్కోరు 38 ఓవర్లకి 123/1 గా ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ను అధిగమించాలంటే న్యూజిలాండ్ ఇంకా 434 పరుగులు చేయాల్సి ఉంది.