: ఆందోళనకు దిగిన వాయిళ్లపల్లి గ్రామస్తులు.. సెల్‌టవర్‌ ఎక్కి నిరసన తెలుపుతున్న యువకులు


తెలంగాణ‌లో రేప‌టి నుంచి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ ప‌లు ప్రాంతవాసుల ఆందోళ‌న‌లు ఇంకా కొన‌సాగిస్తూనే ఉన్నారు. నల్గొండ జిల్లాలోని సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని వాయిళ్లపల్లి వాసులు ఈరోజు ఉద‌యం ఆందోళ‌న‌కు దిగారు. త‌మ గ్రామాన్ని ఘట్టుప్పల్‌ మండలంలో క‌ల‌ప‌కూడ‌ద‌ని నిర‌స‌న తెలుపుతున్నారు. కొంద‌రు యువ‌కులు సెల్ ట‌వ‌ర్ ఎక్కి త‌మ డిమాండును నెర‌వేర్చాల‌ని నిర‌స‌న తెలుపుతున్నారు. త‌మ అభిప్రాయాన్ని ప్ర‌భుత్వం పెడ‌చెవిన పెడుతోంద‌ని అంటున్నారు. దాదాపు 1850 మంది గ్రామ‌స్తులు మీసేవ ద్వారా అభిప్రాయాలు వెల్లడించార‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News