: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో.. కేసీఆర్ క్యాబినెట్ అత్యవసర భేటీ


తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ కు ఆమోదం కోసం మరికాసేపట్లో కేసీఆర్ మంత్రివర్గ అత్యవసర భేటీ జరగనుంది. కొత్తగా ప్రకటించిన 31 జిల్లాల ముసాయిదాలో మార్పులను చర్చించి, ఆపై నోటిఫికేషన్ కు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఈ సమావేశం ఎజెండాగా తెలుస్తోంది. 7వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సైతం అప్పటివరకూ ఉన్న ముసాయిదా నోటిఫికేషన్ కు ఆమోదం తెలిపిన సంగతి విదితమే. ఆపై కూడా పలు మార్పులు జరగడం, రేపటి నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కావాల్సి వుండటంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి తుది నోటిఫికేషన్ కు ఆమోదం తప్పనిసరి కావడంతోనే క్యాబినెట్ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News