: ఇండోర్ టెస్టు: క్రీజులో న్యూజిలాండ్ ఓపెనర్లు
న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ భారత్ పర్యటనలో భాగంగా ఇండోర్ వేదికగా కొనసాగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్సింగ్స్ లో టీమిండియా 557 పరుగులు చేసి డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం న్యూజిలాండ్ ఓపెనర్లు గుప్తిల్, లాథమ్ కలసి తమ మొదటి ఇన్సింగ్స్ ప్రారంభించారు. గుప్తిల్ 32 పరుగులు, లాథమ్ 18 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ స్కోరు 20 ఓవర్లకి 5 ఎక్స్ట్రా పరుగులతో 55 గా ఉంది.