: ఏటీఎంలో డబ్బు డ్రా చేసి దొరికిపోయిన మోనికా హంతకుడు
గోవాలో సంచలనం సృష్టించిన పెర్ఫ్యూమ్ స్పెషలిస్ట్ మోనికా ఘర్డే హత్యకేసులో నిందితుడిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మోనికా ఇంతకుముందు ఉన్న అపార్టుమెంట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన రాజ్ కుమార్ అనే వ్యక్తే ఆమెను దారుణంగా హత్య చేశాడని, ఈ విషయాన్ని నిందితుడు అంగీకరించాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మోనికాపై అత్యాచారం చేసి, ఆపై ఊపిరాడకుండా గొంతు బిగించి హత్య చేసినట్టు పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అత్యాచారం జరిగిందా? లేదా అన్నది పోస్టుమార్టం తరువాత స్పష్టం చేస్తామని పోలీసులు తెలిపారు. ఇక మోనిక హత్యానంతరం, ఆమె డెబిట్ కార్డును తీసుకుని రాజ్ కుమార్ బెంగళూరు పారిపోయాడు. ఆమె కార్డు నంబర్లను సేకరించి, నిఘా పెట్టిన పోలీసులు, బెంగళూరులో రాజ్ కుమార్ డబ్బు డ్రా చేయగానే, ఎక్కడి నుంచి తీశాడో సదరు పోలీసు స్టేషన్ కు క్షణాల్లో సమాచారం ఇవ్వడంతో దొరికిపోయాడు. రాజ్ ను గోవాకు తీసుకు వచ్చిన తరువాత హత్యకు అసలు కారణాన్ని విచారించి కనుగొంటామని పోలీసులు తెలిపారు.