: 2011లో పాక్‌పై సర్జికల్ దాడులు.. వీడియోలు, ఫొటోలు విడుదల చేసిన ‘ద హిందూ’


భారత్ సర్జికల్ దాడులకు పాల్పడడం ఇదేమీ కొత్తది కాదని, 2011లోనే పాక్‌పై భారత్ సర్జికల్ దాడులు నిర్వహించిందంటూ ‘ద హిందూ’ ఆంగ్ల దినపత్రిక పూర్తి ఆధారాలతో కథనాన్ని ప్రచురించింది. అప్పట్లో భారత ఆర్మీ నిర్వహించిన దాడుల్లో 8 మంది పాక్ సైనికులు మృతి చెందారని పేర్కొంటూ వీడియోలు, ఫొటోలను బహిర్గతం చేసింది. అత్యంత హింసాత్మకంగా జరిగిన ఈ దాడుల్లో ఇరువైపులకు చెందిన మొత్తం 13 మృతి చెందారని పేర్కొంది. ‘జూలై 30, 2011న కుప్వారాలోని గుగల్దార్ పోస్టుపై పాక్ సైనికులు దాడి చేశారు. ఐదుగురు భారత సైనికులను దారుణంగా హత్య చేశారు. అంతేకాదు, తమవెంట హవల్దార్ దేవేందర్ సింగ్, జైపాల్ సింగ్ తలలను తీసుకెళ్లారు. మరో సైనికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆగస్టు 30న భారత ఆర్మీ ‘ఆపరేషన్ జింజర్’ పేరుతో సర్జికల్ దాడులతో పాక్ భూభాగంపై విరుచుకుపడింది. 8 మంది పాక్ సైనికులను హతమార్చింది. వారిలో ముగ్గురి తలల్ని భారత సైనికులు వెంట తీసుకొచ్చారు. ఈ మొత్తం ఆపరేషన్ 45 నిమిషాల్లో ముగిసింది’ అని పత్రిక పేర్కొంది.

  • Loading...

More Telugu News