: పగ తీర్చుకునేందుకు ఇదో మార్గం... 'ఎల్ఓసీ' పేరిట పాక్ హోటల్ పిజ్జా... సగం వెజ్!
ఎల్ఓసీ - లైన్ ఆఫ్ కంట్రోల్. అచ్చ తెలుగులో చెప్పాలంటే వాస్తవాధీన రేఖ. నిత్యమూ తుపాకి మోతలతో దద్దరిల్లుతుంటుంది. ఇండియాకు సంబంధించినంత వరకూ ఎల్ఓసీకి ఆవల శత్రువులున్నార్నది ఎంత నిజమో, పాక్ తరఫు నుంచి ఆలోచిస్తే ఎల్ఓసీకి అవతల ఉన్న మనం వారికి శత్రువులమే. నిత్యమూ ప్రజల్లో నానుతూ ఉండే ఈ పేరును క్యాష్ చేసుకోవాలని చూసిన ఓ పాక్ బేకరీ తాము తయారు చేసే పిజ్జాకు 'ఎల్ఓసీ' అని పేరు పెట్టింది. దీని స్పెషల్ ఏంటంటే, ఇది సగం శాకాహారం, సగం మాంసాహారం. కరాచీలోని కేఫ్ సత్తార్ బక్ష్ ఈ స్పెషల్ పిజ్జాను అందిస్తోంది. ఇక వెజిటేరియన్ భాగంలో భారత జెండాలోని మూడు రంగులతో, నాన్ వెజ్ వైపు పాకిస్థాన్ జెండాను అలంకరించి మరీ ఎల్ఓసీ పిజ్జాను సర్వ్ చేస్తోంది కేఫ్. ఈ పిజ్జాను చూస్తూ, కరకరా నమిలేస్తూ తామేదో భారత్ పై పగ తీర్చుకుంటున్నామని ఫీలైపోతున్నారట ఆ దేశ వాసులు.