: మారిన చైనా వైఖరి... ఎన్ఎస్జీకి సహకరిస్తామని వెల్లడి


న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో ఇండియా చేరేందుకు తాము సహకరిస్తామని చైనా మంత్రి ఒకరు వెల్లడించారు. ఎన్ఎస్జీలో పూర్తి స్థాయి సభ్యత్వాన్ని ఇండియా పొందేందుకు గల అన్ని అవకాశాలనూ చర్చించనున్నట్టు విదేశాంగ శాఖ సహాయమంత్రి లీ బావోడాంగ్ పేర్కొన్నారు. గత నెలలో ఎన్ఎస్జీ సమావేశాలు జరిగిన వేళ, భారత్ ను చేర్చుకునే విషయం చర్చకు రాగా, చైనా అడ్డుపడ్డ సంగతి తెలిసిందే. ఆపై ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాల మద్దతును కూడగట్టడంలో విజయం సాధించగా, చైనా సైతం ఓ మెట్టు దిగి తన వైఖరి మారిందన్న సంకేతాలను పంపక తప్పలేదు. ఇక మరో వారంలో ఇండియాలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాల సమావేశం జరగనుండటం, ఆ సమావేశాలకు చైనా అధ్యక్షుడు క్సీ జిన్ పింగ్ రానున్న నేపథ్యంలో లీ మాట్లాడుతూ, ఎన్ఎస్జీ సభ్య దేశాలు పాటించాల్సిన నియమాలను తామేమీ నిర్ధారించలేదని లీ అన్నారు. భారత్, చైనాల మధ్య మంచి సంబంధాలున్నాయని, ఇండియా అణుశక్తి సరఫరాదారుల గ్రూప్ లో చేరే విషయంలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News