: రెండో డిబేట్ లోనూ హిల్లరీ దే పైచేయి... హిల్లరీకి 3.56 పాయింట్లు, ట్రంప్ కు 2.59 పాయింట్లు
తన నోటి దురుసుతనంతో అధ్యక్ష పదవికి దూరమవుతున్న ట్రంప్, రెండో బిగ్ డిబేట్ లోనూ హిల్లరీపై ఏ మాత్రం ఆధిక్యాన్ని చూపలేకపోయారు. తాజాగా జరిగిన ముఖాముఖిలో సైతం, గెలిస్తే తానేం చేస్తానన్న విషయాన్ని పక్కనబెట్టిన ఇరువురు నేతలూ, వ్యక్తిగత విమర్శలకు సమాధానం చెప్పుకోవడానికే పరిమితమయ్యారు. ఇక ఈ డిబేట్ అనంతరం ఓ టీవీ చానల్ పోల్ నిర్వహించగా, అత్యధికులు హిల్లరీవైపు నిలిచారు. 5 పాయింట్లకు గాను హిల్లరీకి సరాసరిన 3.56, ట్రంప్ కు 2.59 పాయింట్లు లభించాయి. తొలి డిబేట్ లోనూ హిల్లరీ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాలు ట్రంప్ కు వ్యతిరేకంగా మారడంతో హిల్లరీ శిబిరం ఆనందంగా ఉంది.