: జమ్ముకశ్మీర్ లో మరోసారి తెగబడ్డ ఉగ్రవాదులు... భవనంలో దాగిన ముష్కరులు


జమ్ముకశ్మీర్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. శ్రీనగర్ శివారుల్లో ఉన్న పాంపోర్ లోని ప్రభుత్వ భవనంలో ఉగ్రవాదులు దాక్కుని కాల్పులు జరుపుతున్నారు. ఈ భవనం జమ్ము అండ్ కశ్మీర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ ఇన్స్టిట్యూట్ (ఈడీఐ)కు చెందినది. భవనంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉండవచ్చని భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. ఈ ఉదయం 6.30 గంటల నుంచి గన్ షాట్స్ శబ్దం వినిపిస్తోంది. మరోవైపు, భద్రతాదళాలు కూడా భవనాన్ని చుట్టుముట్టి, ముష్కరులను మట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. భవనాలను కాంక్రీట్ బంకర్లుగా ఉపయోగిస్తూ, భారత భద్రతాబలగాలపై కాల్పులు జరపడం ఉగ్రవాదులకు ఈమధ్య కాలంలో పరిపాటిగా మారింది. గతంలో కూడా సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి ఇద్దరు జవాన్లను చంపిన ఉగ్రవాదులు ఈడీఐ భవనంలోనే దాక్కున్నారు. ఆ తర్వాత, భద్రతాదళాలు భవనాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేశాయి. అప్పుడు జరిగిన క్రాస్ ఫైర్ లో ఒక సాధారణ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.

  • Loading...

More Telugu News