: హైదరాబాద్‌లో అర్ధరాత్రి రౌడీషీటర్ల గ్యాంగ్‌వార్.. సలీంను హత్య చేసిన ఇర్ఫాన్
హైదరాబాద్‌లో అర్ధరాత్రి రౌడీషీటర్ల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్‌లో ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. నగరంలోని ఫలక్‌నుమాలో జరిగిన ఈ గ్యాంగ్‌వార్‌లో మహ్మద్ సలీం అనే రౌడీషీటర్‌ను మరో రౌడీ షీటర్ ఇర్ఫాన్ దారుణంగా హత్యచేశాడు. సలీం తమ్ముడు, రౌడీ షీటర్ అయిన ఫైరోజ్‌ఖాన్ కూడా ఇటీవలే హత్యకు గురయ్యాడు. రౌడీషీటర్ల గ్యాంగ్‌వార్‌పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సలీం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.