: కాన్పూర్ లో యువ మహిళా న్యాయమూర్తి ఆత్మహత్య


ఉత్తరప్రదేశ్ కాన్పూర్ రూరల్ లో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న ప్రతిభా గౌతమ్ (30) అనే మహిళా న్యాయమూర్తి ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డారు. ఎస్పీ సోమన్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం, ప్రతిభా గౌతమ్ సర్క్యూట్ హౌస్ కాలనీలో నివాసముంటున్నారు. ఆమె భర్త ఢిల్లీలో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్నారు. నిన్న ఢిల్లీ నుంచి కాన్పూర్ వచ్చిన ఆమెకు భర్త ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో, కంగారుపడ్డ, భర్త ఈరోజు ఉదయం కాన్పూర్ వచ్చారు. ఇంటికి చేరుకుని చూసేసరికి ఫ్యాన్ కు వేలాడుతున్న ఆమె మృతదేహం కనపడింది. కాగా, ప్రతిభా గౌతమ్ శరీరంపై గాయాలున్నాయని, పోస్టు మార్టం అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశముందని ఎస్పీ సోమన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతిభ భర్త, కుటుంబసభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ తరచూ పోట్లాడుకునేవారని స్థానికులు చెప్పినట్లు పోలీసుల సమాచారం.

  • Loading...

More Telugu News