: పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. హాస్యనటుడు పృథ్వీపై కేసు నమోదు
ప్రముఖ హాస్యనటుడు పృథ్వీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పృథ్వీ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఒక మహిళ హైదరాబాదు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం హాస్యనటుడిగా బిజీగా ఉన్న పృథ్వి తనదైన శైలిలో డైలాగ్ లు పలికిస్తాడు. ఖడ్గం చిత్రంలో ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ అంటూ ఆయన చెప్పిన మేనరిజం డైలాగ్ బాగా పాప్యులర్ అయింది.