: సీపీఎం పార్టీ వాళ్లను నిలదీయండి..ముక్కు నేలకేసి రాయించండి: కేసీఆర్
సీపీఎం పార్టీ తెలంగాణలో త్వరలో చేపట్టనున్న ‘మహాజన యాత్ర’పై, ఆ పార్టీ నాయకులపై సీఎం కేసీఆర్ మండిపడ్దారు. వరంగల్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, "తెలంగాణలో తిరిగే అధికారం సీపీఎం పార్టీ వాళ్లకి లేదు. ఎందుకంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును చివరి నిమిషం వరకు వ్యతిరేకించిన పార్టీ అది. ఈ రోజుకి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సమర్థించని వాళ్లు యాత్రలు చేపడతారా!.‘మహాజన పాదయాత్ర’ అంటూ బయలు దేరుతున్నారు. 150 రోజుల పాటు యాత్ర చేస్తారట.. అసలు, అది ఏమి యాత్రో.. ఎందుకు పనికొచ్చే యాత్రో.. వాళ్ల ఉనికి పోతుంటే, ఓర్వలేక చేస్తున్న యాత్ర ఇది. తెలంగాణ ప్రజలకు నేను మనవి చేస్తున్నాను.. సీపీఎం పార్టీ వాళ్లను ఎక్కడికక్కడ నిలదీయండి.. క్షమాపణలు చెప్పించి, ముక్కు నేలకేసి రాయించండి. తెలంగాణ ప్రజలకు నేను చేసే వినతి ఒక్కటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పని చేసినా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ప్రజల మంచికోరి, అంతిమంగా బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తాం తప్పా, వేరే ఉద్దేశ్యాలు ఈ ప్రభుత్వానికి లేవు’ అని కేసీఆర్ అన్నారు.