: కేసీఆర్ కు అమ్మవారు గుర్తుంది కానీ, సోనియమ్మ గుర్తు లేదా?: వీహెచ్


సీఎం కేసీఆర్ కు అమ్మవారు గుర్తుంది కానీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ మాత్రం గుర్తు లేదా? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. కేసీఆర్ తన సొంత డబ్బులతో అమ్మవారికి కిరీటం చేయించాలి కానీ, ప్రజల సొమ్మును ఎలా ఖర్చు చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని, కులాల సర్వే వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలని, బీసీ జనాభా ఎక్కువ ఉందని కేసీఆర్ భయపడుతున్నారని ఆయన విమర్శించారు. బీసీ స్టడీ సర్కిల్ లో కూడా అగ్ర కులాల పెత్తనం ఎక్కువైపోయిందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News