: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. బంగారు తెలంగాణ వైపు పయనిస్తున్నామని, దసరా పండగ తర్వాత వరంగల్ అభివృద్ధిపై పయనిస్తామని అన్నారు. వరంగల్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరంగల్ అభివృద్ధికి రూ.300 కోట్లు కేటాయించామని, వరంగల్ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు. కాగా, దుర్గాష్టమి పర్వదినం, అమ్మవారి జన్మనక్షత్రం సందర్భంగా భద్రకాళి అమ్మవారికి రూ.3.7 కోట్ల వ్యయంతో తయారు చేయించిన 11.7 కిలోల స్వర్ణ కిరీటం సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.