: నేను ఫోన్ చేసే దాకా నువ్వు చేయవా? అంటూ బ్రహ్మానందం తిడుతుంటారు: హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి
‘నేను ఫోన్ చేసే దాకా నువ్వు ఫోన్ చేయవా?' అంటూ బ్రహ్మానందం గారు నన్ను తిడుతుంటారు’ అని హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి అన్నాడు. వారానికి ఒకసారైనా మా కామెడీ సర్కిల్ లో వాళ్లకి ఫోన్ చేసి మాట్లాడుతుంటాననీ, ప్రస్తుతం ఉన్న హాస్యనటులు అందరూ తనకు మంచి ఫ్రెండ్సేనని చెప్పాడు. ఏదైనా చిత్రంలో హీరోగా నటిస్తే ఎక్కువ టెన్షన్ ఉంటుందని, కామెడీ పాత్రో, క్యారెక్టర్ పాత్రలోనో నటిస్తే అంత టెన్షన్ ఉండదని చెప్పాడు. ప్రస్తుతం సినిమాల్లో క్వాలిటీ కామెడీ వుండటం లేదన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఆ మాట కొంతవరకు వాస్తవమేనని అన్నాడు. ప్రస్తుతం రైటర్స్ అందరూ డైరెక్టర్లు అయిపోతున్నారని, దానికి కారణాలు ఏవైనా అయి ఉండవచ్చు అని శ్రీనివాస్ రెడ్డి అన్నాడు.