: పీసీసీ అధ్యక్షుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి: తెలంగాణ సీఎం కేసీఆర్


అమ్మవారి దయవల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి స్వర్ణకిరీటం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, భద్రకాళి ఆలయం అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ఈ సందర్భంగా హామీ యిచ్చారు. దసరా తర్వాత వరంగల్ అభివృద్దిపై సమీక్షిస్తామని, మాస్టర్ ప్లాన్ కు తుదిరూపు ఇచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రతిపక్షాలు తెలిసీ తెలియక మాట్లాడుతున్నాయని, తెలంగాణలో జిల్లాల విభజన చేపట్టకముందు ఒకరకంగా, జిల్లాల విభజన తర్వాత మరొక రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ‘ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఏడాది కిందట సీఎస్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశాం. సుదీర్ఘ చర్చల తర్వాతే జిల్లాల ఏర్పాటు జరుగుతోంది. ఒక జిల్లాలో నాలుగు లక్షల లోపు కుటుంబాలు ఉంటే.. అభివృద్ధిలో అద్భుతాలు సృష్టించవచ్చు. ప్రజల సంక్షేమం కోసమే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు. ఇది ఇష్టం లేక కొందరు రాజకీయాలు చేస్తున్నారు' అంటూ కేసీఆర్ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News