: నాకు నాగబాబు, పవన్ ఎంతో వినాయక్ కూడా అంతే!: చిరంజీవి
దర్శకుడు వీవీ వినాయక్ తనకు సోదరుడి వంటి వాడని, నాగబాబు, పవన్ కల్యాణ్ ఎంతో వినాయక్ కూడా అంతేనని చెప్పారు చిరంజీవి. తనను ఎంతో వినయంగా అన్నయ్యా అని పిలిచే వినాయక్, పది మందికీ సాయపడాలని భావించే గుణమున్న వ్యక్తని, అదే తనను చాలా ఇంప్రెస్ చేసిందని వెల్లడించారు. ఓ దర్శకుడిగా కన్నా, వ్యక్తిగా తనకెంతో నచ్చిన వ్యక్తని కొనియాడారు. ఆదివారం నాడు వినాయక్ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు వెల్లడించారు. ఆయన దర్శకత్వంలోనే చిరంజీవి 150 చిత్రం 'ఖైదీ నంబర్ 150' రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.