: ధోనీని దాటేసిన టెస్టు కెప్టెన్... గవాస్కర్, అజారుద్దీన్, సచిన్ తరువాత కోహ్లీ!


భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉంటూ అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్లలో ఇప్పటికే ధోనీని అధిగమించేసిన విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ జట్టుపై తాజా సెంచరీతో టైగర్ పటౌడీని దాటేశాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా ఉన్నాడు. కెప్టెన్ గా ఆరు సెంచరీలు చేసిన కోహ్లీకన్నా ముందు ముగ్గురు మాత్రమే ఉండగా, వీరిని అధిగమించి, తన పేరిట అరుదైన రికార్డు నెలకొల్పేందుకు కోహ్లీకి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. కాగా, భారత జట్టు కెప్టెన్లుగా ఉండి సెంచరీలు సాధించిన వారిలో గవాస్కర్ (11) అగ్రస్థానంలో ఉండగా, ఆపై అజారుద్దీన్ (9), సచిన్ (7) శతకాలతో ఉన్నారు. కోహ్లీ మరో ఐదు సెంచరీలు చేస్తే, వీరందరి రికార్డులూ పటాపంచలవుతాయి.

  • Loading...

More Telugu News