: ఆఫ్గన్ లో సైనిక హెలికాప్టర్ ను కూల్చేసిన తాలిబాన్లు!


ఆఫ్గనిస్థాన్ లో తాలిబాన్ ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. ఆర్మీకి ఆయుధాలను తరలించేందుకు వెళుతున్న హెలికాప్టర్ ను కూల్చేయగా, 8 మంది సైనికులు మరణించినట్టు తెలుస్తోంది. ఉత్తర బ్లాగన్ ప్రావిన్స్ లో ఈ ఘటన జరిగింది. కాగా, హెలికాప్టర్ కూల్చివేతపై ప్రభుత్వాధికారుల వివరణ మరోలా ఉంది. సాంకేతిక లోపం కారణంగానే హెలికాప్టర్ కూలిందని అధికారులు వివరించారు. అయితే తామే కూల్చేశామని తాలిబాన్ జబీహుల్లా ముజాహిద్ పేర్కొంది. ఇటీవలి కాలంలో రెచ్చిపోతున్న తాలిబాన్ ఉగ్రవాదులు, బాగ్లాన్, కుందూజ్ ప్రావిన్స్ ప్రాంతాల్లో సైనికులపై దాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News