: రాజకీయ కష్టాల్లో రిపబ్లికన్ పార్టీ... ట్రంప్ గెలిచే అవకాశాలు లేవంటూ దిగిపోవాలని ఒత్తిడి!
అమెరికాలో ఎంతో ప్రభావం చూపగల సత్తా ఉన్న రిపబ్లికన్ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనంత రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న వేళ, అధ్యక్ష పదవికి తమ పార్టీ తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశాలు తగ్గుతున్నాయని భావిస్తున్న ఎందరో రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు బాహాటంగానే ఆయన్ను తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా వీడియో, అందులో మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ ఇక గెలిచే అవకాశాలు లేవని చెబుతూ, దాదాపు 20 మందికి పైగా రిపబ్లికన్ ప్రతినిధులు ట్రంప్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఆయన తప్పుకోవాలని కోరారు. స్వయంగా వైస్ ప్రెసిడెంట్ నామినీ మైక్ పెన్సీ సైతం ట్రంప్ తప్పుకుంటేనే మంచిదని చెప్పడం గమనార్హం. పెన్సీతో పాటు జాన్ మెక్ కెయిన్ సైతం గొంతు కలిపాడు. కాగా, తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన ట్రంప్, అధ్యక్ష పదవి నుంచి తప్పుకునే ఆలోచన మాత్రం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.