: పేగులు, కిడ్నీలు ఎండిపోయి మరణించిన ఆరాధన: 'జైన బాలిక' మృతిపై కిమ్స్ వైద్యులు

జైన బాలిక ఆరాధన ఉపవాస దీక్ష పేరిట తిండి మానేసిన తరువాత, ఆమె పేగులు, కిడ్నీలు ఎండిపోయాయని, ఈ కారణంతో శరీరంలోని పలు అవయవాలు పని చేయని స్థితికి వచ్చి, గుండె ఆగి మరణించిందని కిమ్స్ వైద్యులు తెలిపారు. ఆమెను ఆసుపత్రికి తీసుకు వచ్చేటప్పటికే మరణించిందని అధికారిక ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్ లోని సెయింట్ ప్రాన్సిస్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆరాధనను, స్వయంగా తల్లిదండ్రులే జైన సంప్రదాయం పేరిట ఉపవాస దీక్షకు దించి, కేవలం మంచినీటిని, అది కూడా సూర్యుడు ఉన్న సమయంలోనే తాగాలన్న నిబంధనతో పూజలో కూర్చోబెట్టి ఆమె మరణానికి కారణమైన సంగతి తెలిసిందే. తీవ్ర డీహైడ్రేషన్ కు గురైన ఆరాధన, అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోగా, ఇప్పుడు పోలీసుల విచారణ ప్రారంభమైంది. వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయన్న కారణంతో ఓ మత గురువును ఆశ్రయించిన ఆరాధన తండ్రి మనీష్ సమదారియా, తన కూతురితో ఈ దీక్ష చేయించారని, ఇది బాలల హక్కులకు విఘాతం కలిగించే చర్యని బాలల హక్కుల సంఘం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News