: మార్కెట్లోకి 'వోక్స్ వ్యాగన్ పోలో' పెట్రోల్ కారు
'వోక్స్ వ్యాగన్' పోలో పెట్రోల్ వెర్షన్ కారు మార్కెట్లోకి వచ్చేసింది. జర్మనీ కార్ల తయారీ దిగ్గజం వోక్స్ వ్యాగన్ తాజా వేరియంట్ ను నేడు ముంబయిలో విడుదల చేసింది. నూతన పోలో కారు ధర రూ.7.99 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూం)గా నిర్ణయించినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ సక్సేనా వెల్లడించారు. అయితే ముంబయి మార్కెట్లో ధరను ఎంతవరకు నిర్ణయించిందనేది కంపెనీ తెలుపలేదు. ఇంధనం ఆదా చేయడంలో ఈ కారు మిగతా కార్లకు గట్టిపోటీ ఇవ్వడం ఖాయమని కంపెనీ వర్గాలంటున్నాయి.