: కాలిఫోర్నియాలో ఇద్దరు పోలీసుల కాల్చివేత.. కుటుంబ సమస్యను పరిష్కరిస్తుండగా రెచ్చిపోయిన దుండగుడు


ఓ కుటుంబ సమస్యను పరిష్కరించేందుకు వెళ్లిన పోలీసులు కాల్చివేతకు గురయ్యారు. కాలిఫోర్నియాలోని పామ్ స్ప్రింగ్స్‌లో శనివారం చోటుచేసుకుందీ ఘటన. కుటుంబ సమస్యను పరిష్కరించేందుకు వెళ్లిన పోలీసులు ఓ వ్యక్తితో నెమ్మదిగా మాట్లాడుతున్నారు. అయితే ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన ఆ వ్యక్తి జేబులోంచి గన్ తీసి పోలీసులను కాల్చాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన పోలీసులను గిల్బెర్ట్ వెగా, లెస్లీ జెరెబ్నీగా గుర్తించారు. నిందితుడిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదని, బహుశా అతడు ఆ ఇంట్లోనే దాక్కుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News