: నా భర్తది నూటికి నూరుపాళ్లు తప్పే... క్షమించండి: ట్రంప్ భార్య
దాదాపు పదేళ్ల క్రితం మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి, ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురైన తన భర్త, రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ను గట్టున పడేసేందుకు ఆయన భార్య మెలానియా ట్రంప్ రంగంలోకి దిగారు. ఆయన తన అభ్యర్థిత్వాన్ని వదులుకోవాలన్న డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మెలానియా ఓ ప్రకటన విడుదల చేశారు. తన భర్త చేసిన వ్యాఖ్యలు నూటికి నూరుపాళ్లూ తప్పేనని చెప్పిన ఆమె, ఆ వ్యాఖ్యలు గర్హనీయమని, అయితే, అవి 11 సంవత్సరాల క్రితం మాటలని గుర్తు చేశారు. ఆ కామెంట్లకు ఆయనే స్వయంగా క్షమాపణలు చెప్పారని, ఇప్పుడు తన భర్త పాత మనిషి కాదని, నాయకత్వ లక్షణాలను పెంచుకున్నారని తెలిపారు. సహృదయంతో క్షమాపణలు స్వీకరించి వివాదానికి స్వస్తి పలకాలని కోరారు.