: టీవీ ఛానెల్ పై వంద కోట్లకు పరువు నష్టం దావా వేసిన సల్మాన్ ఖాన్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఓ టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్ పేరిట తన పరువుకు నష్టం కలుగజేసిందని, ఇందుకుగాను తనకు వంద కోట్ల రూపాయలు పరువు నష్టం చెల్లించాలంటూ బాంబే హైకోర్టులో దావా వేశాడు. 1998 సెప్టెంబరు 26న రాజస్థాన్ లోని జోధ్ పూర్ శివారులోని భవాద్ లో, అదే నెల 28న ఘోడా ఫామ్స్ లో సల్మాన్ జింకలను వేటాడినట్టు ఆరోపణలతో పాటు కేసులు కూడా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అప్పట్లో స్టింగ్ ఆపరేషన్ చేసిన ఓ టీవీ ఛానెల్...ఆ నాటి ఘటనలో ప్రత్యక్ష సాక్షులకు సంబంధించిన పుటేజ్ ను ఈ ఏడాది ఆగస్టు 24న తొలగించినట్టు ఆ ఛానెల్ న్యాయస్థానానికి తెలిపింది. దీంతో 1998లో ఆ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి తన పరువు ప్రతిష్ఠలను దారుణంగా దెబ్బతీసిందని పేర్కొంటూ అదే నెలలో సల్మాన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.