: అపోలో ఆసుపత్రిలో జయలలితను పరామర్శించిన స్టాలిన్
అన్నా డీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రతిపక్ష నేత స్టాలిన్ పరామర్శించారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో శ్వాసకోశ సమస్యతో ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతున్న జయలలితను పరామర్శించేందుకు స్టాలిన్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయనను పన్నీర్ సెల్వం, పళనిస్వామి, శశికళ కలసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత వద్దకు తీసుకెళ్లారు. ఆమెను పరామర్శించిన తరువాత బయటకు వచ్చిన స్టాలిన్ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతానికి ఆమె పూర్తిగా కోలుకోలేదని, పూర్తిగా కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని అన్నారు. ఆమె పూర్తి ఆరోగ్యం సంతరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.