: అప్పుడు నేను చేసినది తప్పైతే, ఇప్పుడు లోకేష్ చేస్తోంది ఏంటి?: నిలదీసిన లక్ష్మీ పార్వతి


20 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా, తాను రాజ్యాంగేతర శక్తిగా అవతరించానని ఆరోపిస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆయనను పదవీచ్యుతుడ్ని చేశారని వైఎస్సార్సీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి ఆరోపించారు. మరి అప్పుడు తాను చేసినది తప్పు అయితే ఇప్పుడు లోకేష్ చేస్తోంది ఏంటని ఆమె నిలదీశారు. లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడాన్ని చంద్రబాబు ఏ విధంగా సమర్థించుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఏ అధికారంతో లోకేష్ మంత్రులపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆమె అడిగారు. ఆ రోజు తాను చేసింది తప్పైతే ఈ రోజు లోకేష్ చేస్తోంది కూడా తప్పేనని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News