: 'అభిమానం' పేరుతో ఆడుకున్న బాలీవుడ్ యువ నటుడు!


సినీ హీరోల కోసం ఫ్యాన్స్ ఏం చేసేందుకైనా వెనుకాడరు. చుట్టూ ఉన్న పరిస్థితులు, విచక్షణ మరిచి మరీ వీరాభిమానం ప్రదర్శిస్తుంటారు. అలాంటి వారిని కొంటె చేష్టల పేరిట రణ్ వీర్ సింగ్ దారుణంగా టీజ్ చేశాడు. ఆ సమయంలో అందరూ ఎంజాయ్ చేయడంతో ఆయన సరదాగా చేశాడని, దానిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని అభిమానులు కూడా సర్దిచెప్పుకుంటున్నారు. దీని వివరాల్లోకి వెళ్తే...ముంబై శివార్లలో ఓ షాపు ఓపెనింగ్ కు బాలీవుడ్ యువ నటుడు రణ్ వీర్ సింగ్ వెళ్లాడు. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఆయన అభిమానుల కోలాహలంతో నిండిపోయింది. ఈ సందర్భంగా రణ్ వీర్ సింగ్ తన అభిమానుల్లో తనపై ఉండే ప్రేమను పరీక్షించాలని భావించాడు. దీంతో ఇక్కడి వారిలో తన వీరాభిమానులు ఎవరని అడిగాడు. ముందుకు వచ్చిన వారిని తన కోసం ఏం చేస్తారని ప్రశ్నించాడు. దీంతో అతని కోసం ఏం చేసేందుకైనా సిద్ధమని వారు తెలిపారు. అయితే ఇప్పటికిప్పుడు ప్యాంట్లు విప్పండని ఆదేశించాడు. పదిమందిలో ఉన్నామన్న జ్ఞానాన్ని మరచిపోయి, వాళ్లంతా ప్యాంట్లు విప్పి అతనిపై అభిమానం చూపించారు. దీనినంతటినీ అక్కడున్న మీడియా ప్రతినిధులు, ఇతరులు ఫుల్ ఎంజాయ్ చేశారు. 'కొంటె రణ్ వీర్ సింగ్' అని కూడా బిరుదును కూడా ఇచ్చారు. అనంతరం రణ్ వీర్ సింగ్ ను షర్టు విప్పాలని వారు కోరడంతో ఉదయం బ్రేక్ ఫాస్ట్ బాగా తినేశానని, షేప్ బాగోదంటూ తప్పించుకున్నాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో పలువురు నెటిజన్లు...ఇది కొంటెపని కాదు, తలతిక్క పని అని పేర్కొంటున్నారు. హీరోలు ఏం చేసినా అభిమానులకు అందంగానే ఉంటుంది.

  • Loading...

More Telugu News