: జయలలితకు కృత్రిమ శ్వాసను పరిస్థితులకు అనుగుణంగా అందిస్తున్నాం: అపోలో వైద్యులు
గత నెల 22 నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం జయ ఊపిరితిత్తుల్లో నెమ్ము తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. ఆమెకు న్యూట్రీషన్స్ తో కూడిన ద్రవపదార్థాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కృత్రిమ శ్వాసను ఆమె ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా అందిస్తున్నట్లు, ప్రత్యేక వైద్య నిపుణుల బృందం జయలలితను ఎప్పటికప్పుడు పరీక్షిస్తోందని తెలిపారు.