: ఈడెన్ గార్డెన్స్ ను శుభ్రపరిచినందుకు కోహ్లీకి మోదీ అభినందనలు


టీమిండియా టెస్ట్ కెప్టెన్ కోహ్లీని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. మై క్లీన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియాన్ని శుభ్రపరిచినందుకు ఈ అభినందనలు దక్కాయి. గత ఆదివారం న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన అనంతరం స్టేడియంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు టీమిండియా ఆటగాళ్లు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కూడా పాలుపంచుకున్నారు. దీనిపై స్పందించిన మోదీ... టీమిండియాకు, కోహ్లీకి అభినందనలు తెలిపారు. 'కోహ్లీ! క్లీన్ ఇండియా కార్యక్రమంలో నీవు భాగస్వామి కావడం చిన్న ప్రయత్నమే కావచ్చు... కానీ, అది ఎందరికో స్ఫూర్తినిస్తుంది' అని మోదీ ట్వీట్ చేశారు. దీనికి ప్రతిస్పందనగా, 'థాంక్యూ మోదీ సార్... తమరి స్ఫూర్తితో దేశ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములం అయ్యేందుకు కృషి చేస్తున్నా'మంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News