: టెస్టుల్లో రెండు వేల పరుగుల క్లబ్‌లోకి రహానే

ఇండోర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ క్రికెట్ టీమ్‌ల మధ్య కొనసాగుతున్న మూడో టెస్టు మ్యాచులో టీమిండియా బ్యాట్స్‌మెన్, భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు అజింక్యా రహానే అద్భుతంగా రాణించి హాఫ్ సెంచరీ చేసి క్రీజులో ఉన్న విషయం తెలిసిందే. నేటి మ్యాచ్‌తో రహానే టెస్టు క్రికెట్ లో రెండు వేల పరుగులను పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. క్రీజులోకి రాకముందు రెండు వేల పరుగుల క్లబ్‌లో చేరుకోవడానికి రహానే కేవలం రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. మైదానంలో అడుగుపెట్టిన కొద్దిసేపటికే రహానే దాన్ని పూర్తి చేసి, రెండు వేల పరుగుల క్లబ్ లో చేరిన 36వ భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ప్రస్తుతం రహానే 58 పరుగులతో క్రీజులో ఉన్నాడు.