: నడిరోడ్డుపై చితక్కొట్టుకున్న ఎమ్మార్వో, సీఐ!


నడిరోడ్డుపై ఎమ్మార్వో, సీఐ చితక్కొట్టుకున్న సంఘటన విశాఖపట్టణం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... అనకాపల్లి మండలం బుచ్చయ్యపేట తహశీల్దార్ వెంకటశివ కారును అనకాపల్లి టౌన్ సీఐ విద్యాసాగర్ రావు ఆపారు. దీంతో ఇది ప్రభుత్వ వాహనమని, తాను ఎమ్మార్వోనని చెబుతూ ఆయన మండిపడ్డారు. దీంతో సీఐ ఆ కారును కాలితో తన్నారు. దాంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది చిలికిచిలికి గాలివానగా మారడంతో, ఇద్దరూ బాహాబాహీకి దిగారు. ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లు నడి రోడ్డు మీద ముష్టియుద్ధానికి దిగడంతో స్థానికులు బిత్తరపోయారు. తొలుత నవ్వుకున్నా తర్వాత జోక్యం చేసుకున్న స్థానికులు ఇద్దరికీ సర్ది చెప్పి పంపేశారు. ఇది ఇప్పుడు ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది.

  • Loading...

More Telugu News