: పోలీసులు రావడంతో తమని తాము పేల్చుకున్న అనుమానిత ఉగ్రవాదులు!
కారు బాంబు పేల్చేందుకు ప్రణాళిక వేసుకున్న ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు, పోలీసులు తమను అదుపులోకి తీసుకోవడానికి రావడంతో తమని తాము పేల్చేసుకున్న ఘటన టర్కీ రాజధాని అంకారాలో చోటుచేసుకుంది. ఆ ఘటనపై అక్కడి పోలీసులు మాట్లాడుతూ.. తాము ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల వద్దకు విచారణ నిమిత్తం వెళ్లినట్లు తెలిపారు. అయితే, వారి వద్ద ఉన్న ఆయుధాలను తమకు అప్పగించాలని అడగగానే వారు ఈ ఘటనకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఆ ఇద్దరిలో ఒక ఉగ్రవాది మహిళ అని చెప్పారు. వీరిరువురికీ కుర్దిష్ వేర్పాటువాదులతో సంబంధాలు ఉన్నట్లు తమకు తెలుస్తోందని వారు చెప్పారు.