: జయలలిత కోలుకోవాలంటూ.. రోగులకు ఉచిత ఆటో సేవలు అందిస్తోన్న అభిమాని!
గత నెల 22 నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె త్వరగా కోలుకోవాలని ఆసుపత్రి ఆవరణతో పాటు తమిళనాడు వ్యాప్తంగా ఆమె అభిమానులు సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మరికొందరు అమ్మ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, చెన్నైకి చెందిన ఆటోడ్రైవర్ సుగుమార్ 17 రోజులుగా ఆసుపత్రి ఆవరణలోనే గడుపుతున్నాడు. అపోలో ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చి, డిశ్చార్జి అయ్యేవారికి ఆయన ఉచిత ఆటో సర్వీసుని అందిస్తున్నాడు. తన ఆటోలో పేషెంట్లను కూర్చోబెట్టుకొని వారి ఇళ్ల ముందు దించుతున్నాడు. తన సేవ ద్వారా అమ్మ ఆరోగ్యం బాగుపడుతుందని ఆకాంక్షిస్తున్నాడు. తాను చేస్తోన్న సేవకు పుణ్యమంతా జయలలితకే దక్కి ఆమె బాగుండాలని కోరుకుంటున్నాడు.