: మా మనుషులు ఎవరినైనా కొట్టగలరు.. జాగ్రత్త!: మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే హెచ్చరిక


మహారాష్ట్ర మంత్రి పంకజముండే మరో వివాదంలో చిక్కుకున్నారు. అహ్మద్‌ నగర్‌ జిల్లాలోని ప్రముఖ ఆలయంలో పనిచేసే పూజారి నామ్‌ దేవ్‌ శాస్త్రి మహరాజ్‌ పై ఆమె బెదిరింపులకు పాల్పడిన ఓ ఆడియో క్లిప్‌ బయటపడింది. దసరా సందర్భంగా అక్కడ ఆమె ఇస్తానన్న ప్రసంగాన్ని నామ్‌ దేవ్‌ వ్యతిరేకించారు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 'దసరా పండగ వరకు నేనేమీ మాట్లాడను. అలాగే మా వాళ్లకు కూడా గొడవపడవద్దని చెబుతాను. నేను మిమ్మల్ని కొనగలిగినా ఆ పని చేయను. గతంలో మీరు అడిగినవన్నీ ఇచ్చాను. గతంలో ప్రభుత్వ పథకానికి చెందిన డబ్బు మీకిచ్చాను. గుర్తుందా? ప్రస్తుతానికి నామ్ దేవ్ శాస్త్రిని ఏం చేయాలన్నది తరువాత చూస్తా' అని ఆమె ఆ ఆడియో క్లిప్పులో చెప్పింది. ప్రస్తుతం దసరా పండగ జరగాలి. ఆ సమయంలో ఏమైనా జరగడం తనకిష్టం లేదని ఆమె చెప్పారు. అలాగని తాము చేతకాని వాళ్లం కాదని ఆమె స్పష్టం చేశారు. పార్లీలో తమ మనుషులు ఎవరినైనా కొట్టగలరు, తప్పుడు కేసులు పెట్టి వాళ్లను అక్కడినుంచి పారిపోయేలా చేయగలరని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్రలో పెనువివాదం రేపుతున్నాయి. చట్టాన్ని పరిరక్షించాల్సిన మంత్రి చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేలా వ్యాఖ్యానిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. ప్రజా శ్రేయస్సుకు కేటాయించిన నిథులను ఆమె స్వప్రయోజనాలకు వాడుకుని, ప్రజల్ని కొనుగోలు చేయడానికి వినియోగించారని శాసన మండలి సభ్యుడు ధనుంజయ్ ముండే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News