: కోహ్లీ హాఫ్ సెంచరీ.. ప్రస్తుత స్కోరు 161/3
న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాధ్యతాయుతమైన ఇన్నింగ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో, ఈ సిరీస్ లో తొలి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. సాధారణంగా టెస్టుల్లో కూడా దూకుడుగా ఆడే కోహ్లీ... ఈ మ్యాచ్ లో నెమ్మదిగా ఆడుతూ, హాఫ్ సెంచరీకి ఏకంగా 108 బంతులను తీసుకున్నాడు. ప్రస్తుతం 56 పరుగులతో ఆడుతున్న కోహ్లీ మొత్తం 6 ఫోర్లను బాదాడు. మరో ఎండ్ లో అజింక్య రహానే కూడా నెమ్మదిగా ఆడుతూ 21 పరుగులు చేశాడు. కోహ్లీ, రహానేలు ఇప్పటి వరకు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు.