: పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాలపై పంజా విసిరిన పోలీసులు


పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. మండలంలోని ఆవుపాడులో కోడిపందాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులను చూడగానే పందెంరాయుళ్లు పరుగందుకున్నారు. చివరకు పందేలు ఆడుతున్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికితోడు, 22 బైక్ లు, రూ. 11 వేలను స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాలు జోరుగా సాగుతున్నాయని గత కొన్ని రోజులుగా పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. దీంతో, ఈ రోజు వారు దాడులు నిర్వహించారు.

  • Loading...

More Telugu News