: ఆన్‌లైన్‌ సిత్రాలు... మొబైల్ ఫోన్ కోసం ఆర్డర్ చేస్తే 20 రూపాయల విమ్‌బార్ వచ్చింది!


ఆన్‌లైన్‌లో వ్యాపారం ఎంత జోరుగా కొన‌సాగుతోందో అంతే మోతాదులో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో జొన్నాదుల హేమవరప్రసాద్ అనే వ్య‌క్తి ఆన్‌లైన్‌లో ఫోన్ కోసం రూ.9,800 చెల్లించి, మొబైల్ ఫోన్ కోసం ఆర్డరు చేస్తే అత‌డికి 20 రూపాయ‌ల సబ్బు వ‌చ్చింది. తాను ఈ నెల ఒకటో తేదీన పానాసోనిక్ ఏ2 స్మార్ట్ ఫోన్ కోసం డ‌బ్బు చెల్లించి అమెజాన్ కంపెనీకి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన‌ట్లు హేమ‌వ‌ర‌ప్ర‌సాద్ తెలిపాడు. బ్లూడాట్ కొరియర్ సర్వీస్ డెలివరీ బాయ్ త‌న‌కు ఓ ప్యాకెట్‌ను ఇచ్చాడ‌ని, దాన్ని వెంట‌నే తెర‌చి చూశాన‌ని చెప్పాడు. అయితే, అందులో త‌న ఇచ్చిన ఆర్డ‌రు లేద‌ని విమ్‌బార్ సబ్బు ఉందని చెప్పాడు. ఈ విష‌యంపై తాను కొరియర్‌బాయ్‌ను అడ‌గ‌గా ఈ విష‌యంపై కంపెనీనే అడ‌గాల‌ని సూచించిన‌ట్లు చెప్పాడు. కొరియ‌ర్ పార్శిల్ వచ్చినట్లు సాక్ష్యం మాత్రమే ఇవ్వగలనని కొరియ‌ర్ బాయ్ త‌న‌కు చెప్పిన‌ట్లు పేర్కొన్నాడు. హేమవ‌ర‌ప్ర‌సాద్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News