: సీసీ కెమెరాల ఆధారంగా హైదరాబాద్ లో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో సోనూ అనే ఓ నాలుగేళ్ల చిన్నారి ఇటీవల అదృశ్యమయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించారు. ఫయీమా బేగం అనే మహిళ ఆ చిన్నారిని అపహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. రాజేంద్రనగర్ లో సోనూ తన సోదరుడితో ఆడుకుంటోన్న సమయంలో ఆటోలో వచ్చిన ఫయీమా బేగం.. సోనూ దగ్గరికి వచ్చి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. రూ.15 వేలకు సోనూని విక్రయించాలని ప్లాన్ వేసుకుని ఆమె ఈ కిడ్నాప్ చేసినట్లు పేర్కొన్నారు. ఫయీమా బేగం కొన్ని రోజుల క్రితం బాలుడి ఇంటిపక్కనే ఉండేదని పోలీసులు చెప్పారు. మగపిల్లవాడు కావాలని ఓ కుటుంబం అడగడంతో వారికి సోనూను విక్రయించాలని చూసిందని చెప్పారు.