: దేశవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు.. దుర్గాపూజలో పాల్గొన్న బాలీవుడ్ నటి సుస్మితాసేన్
దేశ వ్యాప్తంగా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. పలు ప్రసిద్ధ ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ముంబయిలో బాలీవుడ్ నటి సుస్మితాసేన్ దుర్గాపూజలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బాసరలో వైభవంగా అమ్మవారికి పూజలు జరుపుతున్నారు. మూల నక్షత్రం వల్ల బాసరకు భక్తజనం పోటెత్తారు. కాళరాత్రి అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. సికింద్రాబాద్ బోయినపల్లిలో దుర్గామాత ఆలయం వద్ద ఘనంగా దాండియా ఆడారు. చిన్నారులు, స్థానికులు, స్థానిక నాయకులు దాండియా ఆడి ఉత్సాహంగా కనిపించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో కొలువైన కనక దుర్గమ్మ నేడు భక్తులకు సరస్వతి దేవిగా దర్శనమిస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉంది. సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఈరోజు ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారు. అందరి తరఫునా అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తెలుగువారు ఎక్కడున్నా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.