: హయ్యస్ట్ అడ్వాన్స్ టాక్స్ పేయర్గా సల్మాన్ ఖాన్.. ఐటీకి భారీగా చెల్లించిన కండల వీరుడు
ఈ ఏడాది హయ్యస్ట్ అడ్వాన్స్ టాక్స్ పేయర్‌గా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిలిచాడు. తన ప్రతీ సినిమాకి వందకోట్ల కలెక్షన్లు తగ్గకుండా సల్మాన్ సినిమాలు కాసుల వర్షం కురిపిస్తాయన్నది పాత మాట. ఇప్పుడు ఆయన ప్రతి సినిమా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఆయన భారీ పారితోషికం అందుకుంటున్నాడు. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ 16 కోట్ల అడ్వాన్స్ టాక్స్ కట్టాడట. దీంతో ఆయనే ప్రస్తుతం హయ్యస్ట్ అడ్వాన్స్ టాక్స్ పేయర్‌గా ఉన్నాడు. గత ఏడాది ఈ ఘనత బాలీవుడ్ నటుడు అక్షయ్ పేరు మీద ఉండేది. గత ఏడాది అక్షయ్ 18 కోట్లు కట్టాడు. అయితే ఈ ఏడాది 11 కోట్లు చెల్లించాడు. దీంతో ఆయన ఈ అంశంలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మరో నటుడు రణ్‌బీర్ కపూర్ మూడో స్థానంలో నిలిచాడు. ఆయన ఈ ఏడాది 7.8 కోట్లు కట్టాడట. ఇక నాలుగో స్థానంలో ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ నిలవడం విశేషం. మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ ఆ తరువాతి స్థానంలో ఉన్నాడు. కాగా, హృతిక్ రోషన్ పేరు ఈ అంశంలో టాప్ టెన్‌లో కనిపించక పోవడం గమనార్హం. వీరందరి ట్యాక్స్ పేమెంట్ గురించి వివరించిన ఆదాయ పన్ను వసూలు శాఖ అధికారులు బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ లు ఎంత పే చేశారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.