: ఇండోర్ టెస్టు: 26 పరుగులకే తొలివికెట్ కోల్పోయిన టీమిండియా
న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ భారత్ పర్యటనలో భాగంగా జరుగుతున్న టెస్టు సిరీస్ మూడో టెస్టు మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. టీమిండియా స్కోరు 26 పరుగుల వద్ద ఓపెనర్ మురళీ విజయ్ 10 పరుగులకే వెనుదిగాడు. లథమ్ బౌలింగ్‌లో ఫీల్డర్ జీతన్ పటేల్ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రస్తుతం మైదానంలో గౌతమ్ గంభీర్, ఛటేశ్వర పుజారా ఉన్నారు. టీమిండియా స్కోర్ 50 (13 ఓవర్లకి). ఇప్పటికే భారత్ 2-0 తేడాతో సిరీస్ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.